తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

కొల్చారం మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా

ప్రజాబలం కొల్చారం మండలం డిసెంబర్ 10

మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నగంపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్త ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలను మార్చడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమానవేసి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొల్చారం మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా యువత అధ్యక్షులు సంతోష్ రావు తాజా మాజీ జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్ ఎంపీపీ మంజుల కాశీనాథ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేమారెడ్డి సాయిని సిద్ధిరాములు సందీప్ గౌరీ శంకర్ ఆర్య రవీందర్ కొమ్ముల సురేష్ గౌడ్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking