అన్నదాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అన్నపూర్ణ సేవా సమితి
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 10
శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (బొమ్మల గుడి) జమ్మికుంటలో గత రెండు సంవత్సరాల నుండి అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది. తేదీ 12- 12- 2024 నాటికి రెండు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎంతో గర్వంగా ఉందని, ఇట్టి నిత్య అన్నదానానికి సహకరించిన దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో బొమ్మలగుడి అభివృద్ధికి సహకరించిన దేవాలయం ట్రస్టులైన కొండూరు వారి కుటుంబ సభ్యులకు దాతలకు అన్నపూర్ణ సేవా సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇకనుండి కూడా శివాలయంలో జరుగుతున్న నిత్య అన్నదానానికి దాతలు సహకరించాలని వారికి విశ్వేశ్వర స్వామి కృపా కటాక్షాలు కలగాలని అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు ఆ భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు.