ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 03 : ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర రైతాంగానికి లక్ష రూపాయల ఋణ మాఫీ ప్రకటించడాన్ని హర్షిస్తూ లక్షెట్టిపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గురువారం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య,ఉపాధ్యక్షుడు అంకతి రమేష్,గ్రామసర్పంచ్ చుంచు రవి,ఎంపిటిసి గడుసు స్వప్న-రమేష్,గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎంబడి భూమయ్య,గ్రామ యూత్ అధ్యక్షుడు నెరేళ్ల సురేష్, మాజీ సర్పంచ్ బియ్యల సుధాకర్,రైతులు కొట్టే చిన్నయ్య,మండే సత్తయ్య, తిర్రీ శ్రీనివాస్ గౌడ్,చుంచు సుధాకర్,లింగంపల్లి సత్తయ్య,తోగరి తిరుపతి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.