కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 18:
ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అంతేకాకుండా రాహుల్ గాందీ, సోనియాగాంధీ, రేవంత్ రెడ్డి మరియు మల్లు భట్టి విక్రమార్క ఫొటోలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ
ఈ రోజు మొదలుపెట్టింది అని అన్నారు. ఈ సందర్భంగా పులిగంటి వేణుగోపాల్ కాంగ్రెస్ యువజన నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అంతటా నేడు రైతులలో ఒక పండగ వాతావరణం నెలకొందన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మరియు పేద ప్రజల పక్షమే అని వారి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, ప్రవీణ్, యుగంధర్, భాస్కర్, రాజేందర్, కుమార్, జోషి, అజయ్, శ్రీనివాస్, ప్రశాంత్, రాము, మహేష్, సంతోష్, వేణు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking