నిర్మల్ ఎమ్మెల్యే గారికి ఆశా వర్కర్స్ విజ్ఞప్తి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్బంగా ఆశా యూనియన్ నాయకులు చంద్రకళ,గంగామణి,సుజాత మాట్లాడుతు ఆశా వర్కర్లకు 15 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు,కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు ,2024 ఫిబ్రవరి 9 న ఆరోగ్య శాఖ కమీషనర్ గారు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతూ.
తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18,000 -వేలు ఇవ్వాలని,పిఎఫ్, ఈఎస్ఐ,ప్రమాద బీమా,రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారు సమ్మె సందర్భంగా ( ద . 09-10-2023న ) హైదరాబాద్,కోఠి కమీషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశా వర్కర్లతో ధర్నా నిర్వహించాం.ధర్నా సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు ఆశా యూనియన్ ( సిఐటియు ) రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారు.కొన్ని నిర్ధిష్టమైన హామీలు ఇచ్చారు.
ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని వేసిన కమిటీ ఆశాల సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.ఈ కమిటీ ఆశాల డిమాండ్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుందని, యూనియన్ ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు కూడా జరుపుతామని, అన్ని అంశాలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఆశా వర్కర్ల సమస్యలపైన నివేదికను అందజేస్తామని తెలియజేశారు. వీటితోపాటు పెండింగ్ పిఆర్సి ఎరియర్స్, కరోనా రిస్క్ అలవెన్స్ ఇచ్చే విధంగా చూస్తామని,సమ్మె కాలం వేతనాలు చెల్లిస్తామని,ఇతర పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తామని హామీనిచ్చారు.డైరెక్టర్ గారి హామీ ప్రకారం అక్టోబర్ 9 న ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెను విరమించారు.వీటితో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని హామీనిచ్చింది.2024 ఫిబ్రవరి 9 న ఆరోగ్య శాఖ కమీషనర్ ఆఫీస్ ముందు జరిగిన ఆశాల ధర్నా,చర్చల సందర్భంగా కమీషనర్ గారు స్పందిస్తూ రూ .50 లక్షల ఇస్సూరెన్స్ ఇస్తామని,మట్టి ఖర్చులు రూ.50 వేలు ఇస్తామని,రిజిస్టర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని నిర్ధిష్టమైన హామీలు ఇచ్చారు.
పై అంశాల్లో ఒక్క సమ్మెకాలం వేతనాలు మాత్రమే ప్రభత్వం చెల్లించింది.ఇతర సమస్యలు నేటికీ పరిష్కారం చేయలేదు . ఈ సమస్యలు పరిష్కారం చేయాలని అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి ఇప్పటివరకు అనేకసార్లు ఆరోగ్య శాఖామంత్రి,ఆరోగ్య శాఖ రాష్ట్ర అధికారులకు అనేక విజ్ఞప్తులు తెలియజేశాము. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆందోళనా పోరాటాలు నిర్వహించాము . అయినా మా సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదు . దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. కావున పై అంశాలను మీరు పరిశీలన చేసి తగు వేదిక లలో మా సమస్య లను లేవనేత్తి పరిష్కారం కోసం కృషి చేయాలనీ నిర్మల్ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అని,ఈ కార్యక్రమం లో.ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు జె లక్ష్మి .సుగుణ జిల్లా నాయకులు శ్యామల లావణ్య భాగ్య విజయ సుధా అనురాధ పద్మ సరోజ.లక్ష్మి పద్మ రామాలక్ష్మి సుజాత. తదితరులు పాల్గొన్నారు అభినందనలతో. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్,( సి ఐ టి యు ) జిల్లా కమిటీ,నిర్మల్

Leave A Reply

Your email address will not be published.

Breaking