ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ అక్టోబర్ 28:నాచారం డివిజన్ లోని వి ఎస్ టి వాసులు సిసి రోడ్డును మంజూరు చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ, ఎస్ఎస్ఏస్ యువసేన ఆద్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ కాలనీలో అనేక సంవత్సరాలుగా రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయం లో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పరమేశ్వర్ రెడ్డి చొరవతో సిసి రోడ్డుకు గాను 55 లక్షల రూపాయలు మంజూరు చేయడంపై విఎస్టీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి పరమేశ్వర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, రాజారెడ్డి, హెచ్ఆర్ మోహన్, మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి, మహేష్ యాదవ్, నూతల కంటి రాజు, గురు, జావేద్, మహేష్ రెడ్డి, గణేష్, అభిషేక్,సాయి ప్రసాద్ రెడ్డి, నవీన్ వి ఎస్ టి వాసులు జూపల్లి నరేష్, శ్రీనివాస్ రెడ్డి, భూమురావు, వెంకటనారాయణ, రాజు, రాము, నిఖిల్, సజిదా బేగం తదితరులు పాల్గొన్నారు