రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 17 సెప్టెంబర్ 2024
భారత రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశానుసారం పరిపలనా భవనం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు నిరసనగా మణికొండ మఱ్ఱిచెట్టు కూడలిలో జై తెలంగాణ, జై తెలంగాణ తల్లి అని నినదిస్తు తెలంగాణ తల్లి చిత్ర పటానికి కార్య కర్తలందరూ కలసి కట్టుగా పాలభిషేకం చేయడం జరిగినదని మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలుపుతూ నాలుగు కోట్ల తెలుగు ప్రజల గుండె చప్పుడైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట అమరజ్యోతి సాక్షిగా రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఘోర అపచారం చేస్తూ తెలంగాణ తల్లి అస్తిత్వాన్నే కాల రాచడమని, ఉద్యమ స్ఫూర్తి ఊపిరితీస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేయడమేనని ఇట్టి దుశ్చర్యలను తెలంగాణ ప్రజానీకం క్షమించదని ప్రత్యాయముగా కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే అంతం చేయడానికి తెలంగాణ ప్రజలందరూ కంకణ బద్దులై బుద్ధి చెబుతారని తెలియ జేసినాడు, ఈ కార్యక్రమంలో మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కుంబగల్ల ధనరాజ్, కౌన్సిలర్ నవీన్ కుమార్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, సీనియర్ నాయకులు ముత్తంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణ్ రావు, సంగం శ్రీకాంత్, యాలల కిరణ్, ఉపేంద్రనాధ్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, శైక్ ఆరిఫ్, రామసుబ్బా రెడ్డి, ప్రవీణ్, శ్రీధర్ గుప్తా, మల్లాపురం శ్రీనివాస్, కృపాకర్, మొనేశ్, జైరామ్, సాయి, విష్ణు, చక్రపాణి, భిక్షపతి, మహిళా నాయకురాల్లు విజయ లక్ష్మి, శ్యాంలేట్ రేఖా, మంజు, అన్షు, సింధు తది తరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం గావించినారు.
