కలిసి రానున్న పేదల ఆర్థిక సహాయ కార్యక్రమాలు
లోకల్ కార్డు అస్త్రం తో ముందడుగు
ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 17 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఉమ్మడి జిల్లాకు స్వాగత ద్వారంగా ఉన్న పాలేరు నియోజకవర్గం నుండి వరుసగా రెండవ సారి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఈ ఎన్నికల ద్వారా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి గెలుపొంది అభివృద్ధి, సంక్షేమం కోసం బీఆర్ఎస్ లో చేరిన కందాళ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో ప్రభుత్వ నిధులు, తన సొంత డబ్బుతో ప్రజలు కోరుకున్న అభివృద్ధిని చేసి అశేష ప్రజాభిమానం పొందారు. పాలేరులో అభివృద్ధిని పరుగులు పెట్టించిన కందాళ పేద ప్రజలకు ఆర్ధిక సహాయం చేసి ఆదర్శంగా నిలిచారు కుల సంఘ భవనాలు, ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి తనదైన దాతృత్వంతో సహకారం అందించారు.
అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి ప్రజా బలం రోజు రోజుకూ అశేషంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. 2018 ఎన్నికల ద్వారా తొలిసారి పాలేరు నుండి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టిన కందాల గడచిన కాలంలో ప్రజలతో నిరంతరం అనుబంధం, ఆప్యాయత కల్గిన కుటుంబంగా మారిపోయినట్లు తెలుస్తోంది గతంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న పాలేరు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన కందాల పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ఆయనకు కలిసొచ్చే అంశంగా ఉన్నట్లు సమాచారం ప్రజా సమస్యలకు పరిష్కారం నియోజకవర్గంలో మంచి పేరుంది బీఆర్ ఎస్ లో కొనసాగు తున్నప్పటికీ కాంగ్రెస్, కమ్యూనిస్టు కుటుంబాలతో ఉన్న అనుబంధం, చిన్ననాటి నుండి కూసుమంచి మండలంలో పుట్టి పెరిగిన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలతో ఉన్న పరిచయం ఆయనకు ఈ ఎన్నికల్లో కూడా కలిసొచ్చే అంశంగా ఉన్నట్లు అనుచరగణం పేర్కొంటున్నారు ఎమ్మెల్యేగా నిరంతరం ఇంతకాలం ప్రజలతో మమేకమైన కందాల ఉపేందర్రెడ్డి ఎన్నికల్లో తన సమీకరణల జోరును మరింతగా పెంచారు. తనతో పాటు తన భార్య విజయమ్మ, కుమార్తెలు దీప్తిరెడ్డి దీపికా రెడ్డిలతో కలిసి మండలాల్లో ప్రజలను కలుస్తూ వచ్చారు. బీఆర్ఎస్ నాయకులకు దగ్గరవుతున్నారు నాలుగు మండలాల్లో నలుగురు పర్యటిస్తూ పార్టీని ముందుకునడిపిస్తున్నారు ఎమ్మెల్యే కందాల బాగా పట్టు సాధించిన నేపథ్యంలో ఎక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది కల్గినా ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి ఆదుకునే కార్యక్రమాలు చేస్తుండడం విశేషం అభివృద్ధి, సంక్షేమంతో పాటు లోకల్ వాడినని సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా బీఆర్ఎస్ అభ్యర్థిగా కందాల ఉండటంతో నియోజకవర్గంలో ఫలితం ఏవిధంగా ఉండనుందో వేచి చూడాల్సిందే.