మెదక్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి17
brs అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 69 వ జన్మదిన వేడుకలను తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో కెసిఆర్ పుట్టినరోజు కానుకగా 100 మొక్కలు నాటారు. ప్రతి సంవత్సరం కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటు ఆయన నాయకత్వానికి బాసటగా నిలుస్తున్నామని ప్రజా ప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. భగవంతుని ఆశీస్సులతో కెసిఆర్ దేశ ప్రధాని కావడం ఖాయమని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నేమహాదేవి నవీన్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్,brs గ్రామ కమిటీ అధ్యక్షుడు మామిండ్ల స్వామి, పాలకవర్గ సభ్యులు, మహిళలు,brs నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
