తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 69 వ జన్మదిన వేడుకలను మనికొండ కౌన్సిల్ లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర బీ ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మాల్యాద్రి నాయుడు అధ్వర్యంలో ఘనంగా జరిపించినారు, ఈ వేడుకల్లో ప్రాంతీయ నాయకులు చంద్రకాంత గౌడ్, అందె లక్ష్మణ్ రావు, బుద్దోల్ బబ్లూ, శ్రీరాములు, సూర్యనారాయణ రెడ్డి, వాసు, హరి, రాము, శివ మహిళా నాయకురాలు రాజేశ్వరి తదితరులతో పాటు శ్రీరామ నగర్ కాలనీ వాసులు మరియు ముఖ్య నాయకులు భారీ ఎత్తున పాల్గొని వేడుకలను జయప్రదం చేసినారు.