లక్షెట్టిపేటలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 17 : మంచిర్యాల జిల్లా లోని లక్షెట్టిపేటలోని సీఎం కేసీఆర్ 69 వ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే దివాకర్ రావు ఘనంగా నిర్వహించారు.శనివారం స్థానిక ఉత్కూర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే దివాకర్ రావు కేక్ కట్ చేసి, అన్నదానం చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ….ఇలాంటి జన్మదిన వేడుకలు సిఎం కేసిఆర్ మరేన్నో జరుపుకోవలని అన్నారు.తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమం భారత దేశానికి ఒక నమూనా అని అన్నారు. అలాంటి అభివృద్ధి దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో బిఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందన్నారు.వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్ దని అన్నారు . తెలంగాణ లో నూతన సచివాలయం కు బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఅర్ ను అందరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ తిప్పని లింగయ్య,మండలాధ్యాక్షుడు చుంచు చిన్నయ్య,పట్టణాధ్యాక్షుడు పాదం శ్రీనివాస్,టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking