ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 5
తెలంగాణ మాదిగ హక్కుల దండోరా (టి ఎం హెచ్ డి) మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా పల్లె సమ్మయ్య బాబును నియమిస్తు టిమాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు మాదిగ,రాష్ట్ర అధ్యక్షులు కోరిపల్లి శ్రీనివాస్, మాదిగ ఉత్తర్వులు జారీ చేశారు. తెలిపారు. జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేస్తూ వర్గీకరణ కోసం జరిగే పోరాటంలో ముందుంటూ అగ్ర భాగాన మాదిగ జాతి విముక్తి కోసం పోరాడాలని వారన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పల్లె సమ్మయ్య బాబు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఇంతటి బాధ్యతను అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ సాధించేవరకు మాదిగ జాతి ఐక్యత కోసం వారి అభివృద్ధి కోసం పాటుపడతానని జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేస్తూ జాతి హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని ఆయన అన్నారు.