పంచాయతీ కార్యదర్శి చేతివాటం

 

👉పంచాయతీ బడ్జెట్ పేరుతో లక్షల రూపాయలు స్వాహా
👉ప్రజాబలం ప్రత్యేక కథనం

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చ్ 27(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అన్నారు పెద్దలు,కాని చెట్టుకొమ్మ చిగురును మేక మేసినట్లు ప్రజలు కట్టిన సొమ్మును అన్యాయంగా కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు మింగుతూ అవినీతిలో మా సత్తా చూడండి అనేలా వ్యవహరిస్తున్నారు,వివరాలలోకి వెళితే మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి చేతివాటం చూపిస్తూ గ్రామ బడ్జెట్ లక్షలలో మింగుతుంది,గ్రామానికి సర్పంచ్,పాలకవర్గం లేకపోవటంతో ఒంటెద్దు పోకడతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ పంచాయతీ కార్యదర్శి సంతోష పలు పనులలో వందల రూపాయల బిల్లులను వేలలో,వేల రూపాయల బిల్లులను లక్షల రూపాయలలో బిల్లులు చూపిస్తూ గ్రామ బడ్జెట్ కు తూట్లు పొడుస్తుంది,విద్యుత్ దీపాలు,బోర్లు,పంపులు,పశువుల నీటి తొట్టి,రోడ్డుకు కంకర,పారిశుధ్యం,బన్యర్లు,గురువారం జరిగే సంత(అంగడి) అభివృధి అని ఇలా ఆనేక రకాల పనులు వేల రూపాయలతో చేస్తు లక్షల కొద్ది రూపాయలు బిల్లులు పెడుతూ ఆదాయానికి గండి కొడుతుంది,గతంలో గ్రామ ప్రజలు జిల్లా కలెక్టరుకు పిర్యాదు చేసిన జిల్లా స్థాయి అధికారులు మందలించిన తీరు మరకపోవటంతో గ్రామ ప్రజలు తల పట్టుకుంటున్నారు, ఇలాంటి అవినీతి కార్యదర్శి మన గ్రామానికి వద్దు అంటూ గుసగుసలాడుతున్నారు,ఇప్పటికైనా అధికారులు స్పందించి అవినీతి కార్యదర్శి పై తాగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking