శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ఎన్నిక

 

ప్రజాబలం ఉప్పల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 27:నాచారం శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ఏర్పాటు అయ్యింది. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు శింగిరికొండ నరసింహ అధ్వర్యంలో అధ్యక్షుడిగా శ్రీరామ్ (బండల)సత్యనారాయణ ను ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనరల్ సెక్రటరీగా బొగ్గారపు
రమేష్, కోశాధికారిగా ఏగిన భాస్కర్, ఉపాధ్యక్షుడుగా పుల్లూరి లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీగా గుండా మహేశ్వర మూర్తి, అడిషనల్ జాయింట్ సెక్రటరీ ఎలిశాల లింగం, ముఖ్య సలహాదారులుగా డా. రమేష్, సకినాల రమేష్, బెలీదే బాలకృష్ణ, బచ్చు మోహన్, దారం శ్రీశైలం లను ఎన్నుకోగా సభ్యులు గా గంప చంద్ర శేఖర్, గోవింద సురేష్, నీలా సంతోష్, నల్లూరి సూర్యనారాయణ, గుజ్జా శశికాంత్, గౌరీశెట్టి నరేందర్, కాల్వ సంగమేశ్వర, పసుమతి రవి కుమార్, శ్రీకాకుళ శ్రవణ్ కుమార్, కొత్తమాసు శ్రీనివాస్, భీమవరపు సందీప్, కూకట్ల అనిల్ కుమార్ లు ఎన్నికయ్యారు. పిఆర్వో గా ఆకుతోట హరీష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రతి ఒక్కరూ సంఘం అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. ఉగాది పండుగ పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నాచారం మహంకాళి దేవాలయం లో ప్రధాన అర్చకులు వేదపండితులు వేదాంతం నరసింహమూర్తి చే పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడంతో పాటు పంచాంగాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాచారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking