చట్ట ప్రకారం తెలుపకుండా పెంచిన ఆస్తి పన్ను.

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 27 మార్చి 2025
గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున మణికొండ పరిధి లోని లక్ష్మీ నగర్ కాలనీ స్థానికులను కలువడం జరిగినది. ఈ సందర్భంగా వారు తెలిపిన ప్రధాన సమస్యలు: ఇక్కడ స్థానికంగా ఉన్న తారా కిచెన్ కి విచ్చేసిన సందర్శకుల కామెంట్ ప్రకారం జి.హెచ్.ఎం.సి కంటే రెండు రెట్లు అధికంగా మణికొండ మున్సిపాలిటీలో ఇంటి ఆస్తి పన్ను చెల్లిస్తున్నప్పటికీ స్తానికముగా సరైన రోడ్లు, మంచినీరు లేకపోవడం ట్రాఫిక్ సమస్యలతో సతమత మవుతున్నామని తెలియజేశారు. ఇంటి పన్ను విషయమై పెద్దల వద్ద నుండి సేకరించిన అభిప్రాయం ప్రకారం 1 ఏప్రిల్ 2024 నుంచి 26 జనవరి 2025 వరకు జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో కానీ ఇతరత్రా సంబంధిత విషయాలపై జరిగిన చర్చలలో కానీ ఆస్తి పన్ను పెంచుతున్న విషయం అసలు చర్చకు రాలేదని తెలసినది, మునిసిపల్ చట్ట ప్రకారం ఆస్తి పన్ను పెంచే ముందు నోటీసు/ఇతరత్రా ద్వారా ప్రజలకు తెలియ పరుచవలసిని అవసరం ఉన్నను ఎవరికి చెప్పా పెట్టకుండా కొంతమందికి పెంచి కొంతమందికి పెంచక పోవడం ఏమిటని స్థానికులు విడ్డురపోతున్నారు.

సరియైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా వర్షాకాలంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రోడ్ నెంబర్ 9 లో ఉన్న ఇండ్లను వర్షపు నీరు ముంచెత్తుతోందనీ కావున ఈ కాలనీకి పూర్తిస్థాయి డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. 132 కెవి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ నుంచి అంజలి గార్డెన్స్ మీదుగా పుప్పాలగూడ మెయిన్ రోడ్డు వరకు టీం ఫోర్ బహుళ అంతస్తు సముదాయం వారు వేసిన డ్రైనేజీ లైన్ కారణంగా ఇప్పటికి నాలుగు సార్లు రోడ్డు పాడైందని. ఈ రోడ్డును కేవలం ప్యాచ్ వర్క్ లతో కాకుండా పూర్తిస్థాయిలో నిర్మించాలని మరియు వర్షాకాలంలో ఆ బహుళ సముదాయం నుంచి వచ్చే నీరుని రోడ్డుపైకి వదలకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. పై విషయాలపై సదరు అధికారులు స్పందించి సాధ్యమైనంత త్వరగా ఉపశమనం కలిగించాలని సీతారాం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, సంగం శ్రీకాంత్, ఉపేంద్రనాథ్ రెడ్డి, గోరుకంటి విఠల్, బండమీది మల్లేష్, దిలీప్, కిరణ్ యాలాల, రాజేంద్ర ప్రసాద్, బాను చందర్, సుమనళిని, బొడ్డు శ్రీధర్, బాలాజీ, తిరుపతి, నారాయణ రాజు, బంగారు బాబు, కార్తీక్ తది తరులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking