పండగలా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు : :వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్

 

డప్పులు, కోలాటాలు, నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ శ్రేణులు

వర్ధన్నపేట నియోజకవర్గం ప్రజాబలం ఏప్రిల్ 2:
ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని
అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.
వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ బిమారంలోని డివిఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్య అతిథిగా పాల్గొనటనికి విచ్చేసిన ఆయనకు పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోలాటం ఆడి, డప్పు కొట్టి సందడి చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి దానికి అనుగుణంగా సంక్షేమ పధకాలను అమలు చేస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ గారని తెలిపారు. వర్దన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దెందుకు శాయశక్తుల కృషి చేస్తున్నాని వెల్లడించారు. 55వ డివిజన్ భీమారంలో 38కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. పార్టీ కోసం నిబద్దతతో పని చేస్తున్న కార్యకర్తల కృషి వెలకట్టలేనిదని అన్నారు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఇతర రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాలకే పకులడుతున్నాయని విమర్శించారు. తెలంగాణా రాష్ట్రానికీ మరో సారి కెసిఆర్ నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బందు సమితి అధ్యక్షురాలు లలితా యాదవ్, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, డివిజన్ ప్రెసిడెంట్ అటికం రవీందర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking