ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మట్ట జయంతి
హైదరాబాద్ ఏప్రిల్ 2 ;బిసి లు అందరూ బాగుండాలి అందరూ ముందుకు గౌరవంగా ధైర్యంగా బ్రతకాలి అని ప్రతి ఒక్కరిలో మీరు నింపే ధైర్యం మీరిచ్చే బలమని, ఆర్.కృష్ణయ్య చలో డిల్లి కార్యక్రమం విజయవంతం కావాలని బిసి సంఘం నాయకురాలు మట్ట జయంతి ఆకాంక్షించారు. చలో డిల్లి కార్యక్రమానికి వెలుతున్న ఆర్.కృష్ణయ్య కు ఆదివారం ఆమె ఘనంగా వీడుకోలు పలికారు.పార్లమెంటులో బిసి బిల్లు పెట్టించి, చట్టసభల్లో బిసిలకు 50 శతం రిజర్వేషన్స్ కల్పించుతూ తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు జయంతి తెలిపారు.నీలాగా జీవితాన్ని త్యాగం చేసి సంఘాలు నడపడం అంటే ఎవరికి సాధ్యం కాదు మీకు మీరే సాటి మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉండాలంటే బీసీలే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ పట్ల మీకు మా అందరి మీద ఉన్న ప్రేమను చూసి మేము గర్వపడుతున్నామన్నారు. నమ్మకానికి మా ధన్యవాదాలు ఎల్లవేళలా ఎప్పుడో మా గురించి పోరాటాలు చేస్తూ చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర మీతో కలిసి మీ ఉద్యమాలలో మేము చేసిన ప్రయాణం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. నిజంగా మీ తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళు పేదల గురించి ఆలోచించే మీలాంటి వారికి జన్మనివ్వడం మా అదృష్టంగా భావిస్తాం మేమందరం మేము ఉన్నంతకాలం నీ బాటలోనే మేమందరం కలిసి మీతో ప్రయాణం చేస్తున్నా కృష్ణ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తిలిపారు.ఢిల్లీలో జరిగే కార్యక్రమం విజయవంతం కావాలని ప్రతి ఒక్క ఉద్యమకారుడికి కూడా మట్ట జయంతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు