ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 19 : తల్లి దండ్రులు పిల్లలను బాగా చదివేలా ప్రోత్సహించాలి డీ ఈ ఓ యాదయ్య అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి యాదయ్య మాట్లాడుతూ… విద్యార్థులు చదువుపై మక్కువతో చదువుకోవాలి.విద్యాభివృద్ధికి తగిన సూచనలు సలహాలు అందించారు. ఉపాధ్యాయుల నుండి బోధన విషయాలను సేకరించి తగు సలహాలు అందించారు.ముఖ్యంగా మన రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా వచ్చిన విధులు వాటి నిర్వహణ,నాణ్యతను పరిశీలించాలని తల్లిదండ్రులు ప్రత్యేకంగా జిల్లా విద్యాధికారిని కోరారు. అదేవిధంగా విద్యార్థులకు ఇంటి దగ్గర పాఠశాలలో అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవా అని పరీక్షించారు.అలాగే విద్యార్థినులకు ఇంటి దగ్గర కూడా చదువుకోవడానికి
అన్ని సదుపాయాలు తల్లిదండ్రులు కల్పించాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి చక్కగా చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య పేర్కొన్నారు. విద్యార్థులకు ఏలాంటి అసౌకర్యాలు ఉన్న తక్షణమే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యశోదారకి సమాచారం అందించాలని తెలిపారు. ప్రతిరోజు రెగ్యులర్గా వచ్చిన పిల్లలకు ఎంఈఓ రవీందర్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయురాలు,ఎంఈఓ రవీందర్,తోటి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.