మూడు రోజుల్లో ఆసరా పింఛన్లు దరఖాస్తులు విచారణ ప్రక్రియ పూర్తి చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఆగస్టు 19 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం ఐడిఓసి కార్యాలయం నుండి ఆసరా పింఛన్లు, గృహాలక్ష్మి దరఖాస్తులు పరిశీలన, ఆన్లైన్ ప్రక్రియ, సోషల్ వెల్ఫేర్ ఇంటి పట్టాలు పంపిణీ విచారణ, జిఓ నెం. 76, పోడుపట్టాదారులకు రైతుబంధు నిధులు మంజూరు తదితర అంశాలపై డిఆర్డిఓ, జడ్పి, డిపిఓ, మున్సిల్ కమిషనర్లు, అన్ని మండలాల తహసిల్దార్లు, యంపిడిఓలు, యంపిఓలతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసరా పింఛన్లు మంజూరుకు వచ్చిన దరఖాస్తులు విచారణ పూర్తి చేసి ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని యంపిడిఓలను ఆదేశించారు. గృహాలక్ష్మి పథకానికి 86,773 దరఖాస్తులు రాగా శుక్రవారం వరకు 62 వేల దరఖాస్తులు విచారణ ప్రక్రియ పూర్తి అయినట్లు చెప్పారు. మిగిలిన దరఖాస్తులు విచారణ ప్రక్రియ పూర్తి చేసి ధృవీకరణ నివేదికలు అందచేయాలని ఆదేశించారు. విచారణ ప్రక్రియలో తయారు చేసిన జాబితాను ప్రత్యేక అధికారులు, ఆర్డీఓలు పరిశీలన చేసి ధృవీకరణ చేయాలని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్ణీత ప్రొఫార్మాలో వివరాలు నమోదులు తదుపరి పోర్టల్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ మండలాల్లో సోషల్ వెల్ఫేర్ ఇంటి పట్టాలు విచారణ పెండింగ్ ఉన్నాయని, విచారణ అధికారులు 22వ తేదీ వరకు విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పోడు పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు నిధులు మంజూరుకు ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని యంపిడిఓలను ఆదేశించారు.

ఈ టెలికాన్ఫరెన్సులో జడ్పీ సీఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల తహసిల్దార్లు, యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking