జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 9
జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్ ఇంచార్జ్ సూపరిండెంట్ గా డాక్టర్ పారిపెల్లి శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంచార్జ్ సూపరిండెంట్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వనరులతోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని భవిష్యత్తులో ఉన్నత అధికారుల దృష్టికి ఈ హాస్పిటల్ లో నెలకొన్న సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మేము మా సిబ్బంది పని చేస్తామని దానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుతం హుజరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో సర్జన్ విధులు నిర్వహిస్తున్నానని కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంట ప్రభుత్వ హాస్పటల్ ఇన్చార్జి సూపర్డెంట్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.