ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
మండల తాసిల్దార్ రజనికుమారి
ప్రజాబలం దినపత్రిక,- రామయంపేట్ మండల్
09-09-2024:
మెదక్ జిల్లా రామంపేట మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా స్థానిక తహసీల్దార్ రజని కుమారి, ప్రజల సమస్యలపై ప్రజలు ఇచ్చినటువంటి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజా సమస్య ల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2:00గంటల వరకు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు