దళితబందు రెండవ విడత నిధులు వెంటనే మంజూరు చేయాలి

 

ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 9

ఈరోజు ఇల్లందకుంట మండలంలో దళితబందు సాధన సమితి ఆధ్వర్యంలో దళితబందు రెండవ విడత నిధులు మంజూరు చేయాలనీ స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద వినూత్న నిరణసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 9 నెలలుగా దళితబందు నిధుల కోసం అనేక కార్యక్రమలు చేసిన ప్రభుత్వం మాత్రమే ఏలాంటి చెలనం లేకుండా మూడు కోతుల లాగా వ్యవహరిస్తుంది దళితబందు బాధితుల బాధ ఈ ప్రభుత్వనికి కనబడుతలేదా వినబడుతా లేదా దీనిపై స్పందించడానికి మాటలు రావడం లేదా అనే విదంగా మూడు కోతుల బొమ్మలను ప్రదర్శన చేస్తూ మోకాళ్లపై మొఖరిస్తూ ప్రభుత్వన్ని వేడుకోవడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితబందు రెండవ విడత నిదులను వెంటనే మంజురు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షములో నియోజకవర్గంలోని దళితుల అందరం ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమలు చేసి ప్రభుత్వన్ని ఎండాగట్టే దిశగా ముందుకెళ్తాము అని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళితబందు సాధన సమితి సభ్యులు కోలుగూరి సురేష్,మంద రాజేష్ కోలుగూరి నరేష్,ఆకాష్,బిక్షపతి, రక్షిత్, రాకేష్, ప్రవీణ్,సరిత,అర్జున్ తదితరులు పాలొగొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking