మేకల మల్లిబాబు యాదవ్
చిలకల వెంకట నరసయ్య
ఖమ్మం ప్రతినిది ఫిబ్రవరి19 (ప్రజాబలం) సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి గ్రామంలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కార్యక్రమంలో ఈరోజు ఖమ్మం జిల్లా అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ దంపతులు కుటుంబ సమేతంగా మరియు జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించారు.. జాతర చైర్మన్ పోలేపల్లి నరసయ్య వారికి ఘనస్వాగతం పలికి జాతర వైభవాన్ని దగ్గరుండి చూపించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరైన లింగమంతుల స్వామి జాతర అభివృద్ధి కొరకు ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు కోట్లు రూపాయలు కేటాయించిందని, కానీ ఈ సంవత్సరం అంచనాలకు మించి జాతరకు భారీ ఎత్తున భక్తులు పాల్గొనడం వలన సౌకర్యాలు పూర్తిస్థాయిలో సరిపోలేదని, మాట ఇస్తే ప్రాణం పోయినా మాట తప్పని యాదవ జాతి కొలుచుకునే లింగమంతుల స్వామి ఆలయాన్ని ఇంకా ప్రభుత్వం శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఐదు రోజులు జరిగే ఈ పెద్ద జాతర కార్యక్రమానికి భారీ ఎత్తున యాదవులు పాల్గొనే అవకాశం ఉందని, దీని రాష్ట్ర ప్రభుత్వం పండుగగా గుర్తించి రెండు రోజులు ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించాలని, వచ్చే ఏడాది జరిగే జాతరకు భారీ ఎత్తున సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో లోడిగ వెంకన్న, చేతుల నాగేశ్వరరావు మొరిమేకల కోటయ్య, పొదిల భూపతి మేకల నాగేశ్వరరావు మలుపుల గణేష్, మెరిగల తిరుపతిరావు, మల్లేశం సత్తి వెంకన్న పల్లెబోయిన శ్రీను, పొదిలి సతీష్, తెల్లబోయిన రమణ, పారి నాగేశ్వరరావు, దాసరి వెంకన్న, చెన్ను వెంకటరమణ బొల్లి సైదులు పల్లెబోయిన పుల్లారావు కుటుంబాలతో మరియు యాదవులు భారీ ఎత్తున పాల్గొన్నారు
