నియామక పత్రం అందజేసిన బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 19 (ప్రజాబలం) ఖమ్మం సిటీ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినాకర్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం ఓబీసీ నగర ఉపాధ్యక్షుడిగా మాదారపు హరినాథ్ కు నియామక పత్రాలు అందచేశారు ఈ సందర్భం గా వీరభద్రం మాట్లాడుతూ రాబోయే కాలం బీసీలదేనని బీసీలు ఐకమత్యంగా ఉండి చట్ట సభలలో వారికి రావాల్సిన రిజర్వేషన్లు సాధించుకునేదాక పోరాడాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ల పక్షపాతి అని ప్రభుత్వం బీసీ ల కోసం చేసే కార్యక్రమాలు నూతనంగా ఎన్నికైన బీసీ నాయకులు ప్రతి గడపకు తీసుకెళ్ళాలని కోరారు . నగర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణన కార్యక్రమం యొక్క ప్రాధాన్యత దాని వల్ల బీసీ లకు ఉపయోగపడే ప్రయోజనాలను ప్రతిఒక్క బీసీ బిడ్డలకు వివరించాల్సిన బాధ్యత మనపైన ఉన్నదని దీని పై ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ టీ ఏ అడ్వైజరీ బోర్డు రాష్ట్ర డైరెక్టర్ గజ్జల వెంకన్న తదితరులు పాల్గొన్నారు