👉ఉత్సవమూర్తుల పల్లకి సేవ
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/సదాశివపేట.శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని బుధవారం నాడు రాత్రి పది గంటలకు స్థానిక శ్రీ సంగమేశ్వర ఆలయ ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కన్నులకు విందుగా నిర్వహించారు,ఇట్టి కళ్యాణ కార్యక్రమంలో శ్రీ మల్లికార్జున పూర్ణచందర్ దంపతులు. బుగ్గారం శ్రీనివాస్ దంపతులు,మరియు మాడిశెట్టి ప్రతాప్ తనయుడు మనోజ్ దంపతులు,సూర్యప్రకాష్ పవర్ దంపతులు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని పార్వతీ పరమేశ్వరులకు నూతన వస్త్రాలు పోస్తే మెట్టెలు తలంబ్రాలు పోసి కళ్యాణ కార్యక్రమాన్ని కన్నులవిందగా నిర్వహించారు అనంతరం శ్రీ సంగమేశ్వర భజన భక్త బృందం మరియు రాచన్న గురుస్వామి శివస్వాములఆధ్వర్యంలో పల్లకి సేవ నిర్వహించారు,ఓం నమశ్శివాయ ఓం నమశివాయ అంటూ పురవీధుల మీదగా శివనామ స్మరణతో ఉత్సవమూర్తుల పల్లకి సేవ వైభోపీతంగా నిర్వహించారు,కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే తనయుడు చింత సాయినాథ్,ఆలయ కమిటీ భక్తబృందం మాజీ కౌన్సిలర్ ఆకుల శివకుమార్. ఓదెల సంగమేశ్వర్,మారేపల్లి చిన్నశివ కుమార్. రామ్ రెడ్డి. మునిగి మల్లేశం,సుధాకర్. పరమేష్. ప్రభు. నరసింహారెడ్డి. సంగమేశ్వర్ రెడ్డి.రాచన్న స్వామి. కృష్ణారావు. దత్తు మహారాజ్. రవీంద్రనాథ్. సుబ్రహ్మణ్యం. మణికంఠ. తదితర ఆలయ భక్త బృందం శివ స్వాములు భక్తులు పాల్గొన్నారు.
