కరుణగిరిలో ప్రారంభమైన కరుణగిరి యాత్ర మహోత్సవాలు

 

ప్రారంభించిన ఖమ్మం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 27 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో గల సుప్రసిద్ధ కరుణగిరి పుణ్యక్షేత్ర యాత్ర మహోత్సవములు గురువారం నాడు ఖమ్మం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ ప్రారంభించారు ఈ ఆధ్యాత్మిక మహోత్సవములు వచ్చేనెల రెండవ తేదీ వరకు జరగనున్నాయి యాత్ర మహోత్సవం లొ భాగంగా కరుణగిరిలో ఘనంగా అలంకరించిన ప్రాంగణములు దేవుని యొక్క వివిధ సూక్తుల తో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి ప్రధాన ద్వారం వద్ద అలంకరణంగా ఏర్పాటు చేయబడిన కరుణగిరి జయస్తంభం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ వేడుకలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని నుంచి వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు ప్రారంభ సందర్భంగా అనేకమంది భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కరుణగిరి డైరెక్టర్ ఫాదర్ మాథ్యూ వరప్రసాద్ రాజు మరియు పలువురు చర్చి ఫాదర్లు వికారి జనరల్ తప్పట శౌరీ ప్రోక్రటర్ ఐసాక్ వేలాది భక్తులు సంఘ పెద్దలు కరుణగిరి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

     

Leave A Reply

Your email address will not be published.

Breaking