సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/సదాశివపేట. చిరకొంగు ద్విచక్ర వాహనం వెనక చక్రాలలో చిక్కుకొని మహిళ మృతి చెందిన సంఘటన సదాశివపేట పట్టణంలో చోటుచేసుకుంది, వివరాలలోకి వెళితే,హైదరాబాద్ గాజుల రామారం ప్రాంతానికి చెందిన నడిమి దొడ్డి సామెల్ , భార్య వేధమని కలిసి బుధవారం నాడు రాత్రి ద్విచక్ర వాహనంపై జహీరాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా, జాతీయ రహదారి 65 సదాశివపేట బైపాస్ బ్రిడ్జి వద్దకు రాగానే ద్విచక్ర వాహనం (టీజీ 08 ఎఫ్ 2835)వెనక చక్రాలలో చిక్కుకోవటంతో వేదమని వెనక్కి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినది,విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భర్త సామెల్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.