ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 27 (ప్రజాబలం) ఖమ్మం
జిల్లాలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు జిల్లా కలెక్టర్, ఖమ్మం రూరల్ మండలం తీర్దాల సంగమేశ్వర స్వామి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారుఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ స్వామి వారి చల్లని దీవెనలు భక్తులందరిపై ఉండాలని, జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు దర్శనానంతరం భక్తులతో ఆలయం వద్ద, జాతర సందర్భంగా చేసిన ఏర్పాట్లు ఎలా వున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు అనంతరం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, అర్చకులు జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించి, ప్రసాదం అందజేశారు ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, దేవాదాయ శాఖ అధికారులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking