ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ నియోజకవర్గం ప్రతినిధి ఫిబ్రవరి 26:
మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తానని నేషనల్ రైట్స్ మూవ్మెంట్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ చైర్పర్సన్ షాబుద్దీన్ అన్నారు. నేషనల్ రైట్స్ మూవ్మెంట్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా షాబుద్దీన్ నియమితులయ్యారు. ఈ మేరకు నాచారం లో కార్యాలయాన్ని నేషనల్ చైర్మన్ ఇండియా రాజేష్ కన్న ప్రారంభించి అనంతరం షాబుద్దీన్ కి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శాబుద్దిన్ మాట్లాడుతూ తనపై నమ్మకం తో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నియమించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రతి ఒక్కరు తమ హక్కులు విధులను తెలుసుకోవాలని జీవించాలన్నారు. మానవ హక్కులకు భంగం కలిగితే సమస్యలు తీర్చడానికి తమ అసోసియేషన్ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు నూర్జహాన్ బేగం, మహమ్మద్ సాహిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు