విజయవాడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్‌లోని తన క్యాంప్ ఆఫీసులో వేద మంత్రోచ్ఛరణలు, పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు.జనసేన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పవన్ చేతికి పవర్ రావడంతో ఆయన అభిమానులు, ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.