ఆస్తి పన్ను సకాలంలో చెల్లించండి పట్టణ అభివృద్ధికి దోహదపడండి

 

మున్సిపల్ ప్రత్యేక అధికారి అడిషనల్ కలెక్టర్ ప్రకుల్ దేశాయ్

 

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 19

తెలంగాణ రాష్ట్రంలొ మున్సిపాలిటీల ఆస్తి పన్నులలో రాష్ట్ర స్థాయిలో జమ్మికుంట మున్సిపాలిటీ మొదటి వరుస సాధించి, నిలకడగా మొదటి స్థానంలోనే ఉండాలని దీనికి తొడ్పడుతున్న జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్, అధికారులకు, జమ్మికుంట మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఐఏఎస్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. బుధవారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో పన్నుల వసూళ్ళు చేస్తున్న సుపర్ వైజర్లు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్ లతో ప్రత్యేక అధికారి ప్రపుల్ దేశాయ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో ముందు వరుస స్థానాన్ని నిలకడ ఉంచుతున్నారని ఆయన అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీలో ఇంకా పన్నులు చెల్లించె వారు ఉన్నారని ఈ నెల చివరి వరకు పూర్తిస్థాయిలో పన్నుల వసూళ్లు చేయాలని ప్రత్యేక అధికారి ప్రపుల్ దేశాయ్ అన్నారు. మార్చ్ నెల చివరి వరకు వంద శాతం వసులు చేయాలని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలేని ఆయన తెలిపారు. జమ్మికుంట- హుజూరాబాద్ రోడ్డులో సర్వంగా సుందరమైన పుల మొక్కలను నాటాలని ఆయన ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో గ్రాంట్ విడుదల అయిన మరుక్షణమే మరిన్ని చేత్త సేకరణ వాహనాలు కొనుగోలు చేద్దామని ఆయన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, భాస్కర్, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు పలువురు పాల్గొన్నారు. మరియు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీ లను సందర్శించినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking