సమీకృత గురుకుల పాఠశాలల కోసం భూసేకరణ వేగవంతం చేయాలి

ఆదిలాబాద్‌ (పజాబలం ప్రతినిధి: యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు సమీకృత గురుకుల పాఠశాల కు అవసరమైన స్థలాల సేకరణ వేగవంతం చేసి రేపటి లోగా పూర్తి చేయాలని సెక్రటరీ బ్షోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్‌ మీడియేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ కృష్ణా ఆదిత్య అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ ఛాంబర్‌ లో బుధవారం కమీషనర్‌ కృష్ణ ఆదిత్య ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహిం నిర్వహిం చారు. అంతకుముందు కమిషనర్‌ కృష్ణా ఆదిత్య అదిలాబాద్‌ కలెక్టరేట్‌ కు చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, నిర్మల్‌ కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఆసిఫాబాద్‌ అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌ ఛాంబర్‌ లో నిర్వహించిన సమావేశం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విద్యా వ్యవస్థలో ప్రతిష్టాత్మకమైన మార్పులు తీసుకురావడం కోసం ప్రయోగాత్మకమైన అడుగులు వేయడం జరుగుతుందని, ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలలను రెండు సంవత్సరాలలో నిర్మించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం లక్ష్యం కాగా, ఈ సమీకృత గురుకుల పాఠశాల కు అవసరమైన స్థలాల సేకరణ వేగవంతం చేయాలని అన్నారు. అన్ని హంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మించ తలపెట్టిన సమీకృత రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయం కోసం అదిలాబాద్‌ రూరల్‌ నిషాన్‌ ఘాట్‌ లో స్థలాన్ని జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ అధికారుల తో కలిసి క్షేత్రస్థాయిలో ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం తదితర అంశాలను ఆయన పరిశీలించారు. 20 ఎకరాల స్థలం సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని నిషాన్‌ ఘాట్‌ లో 38 వ సర్వే నెంబర్‌ లో 20 ఎకరాల భూమిని సోషల్‌ వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ వింగ్‌ కు (%జుజుGజుఔIణజ% ) ను ఆయన ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులు ప్రారంభిం చేల ప్రణాళికలు తయారు చేసి, స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన చోట అనుమతులు, ఇతర పనులను వేగంగా చేయాలని ఆదేశించారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో ముందుగా పరిశీలిం చాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యామలా దేవి, రెవెన్యు డివిజనల్‌ అధికారి వినోద్‌ కుమార్‌, ఉమ్మడి జిల్లా ఇంజనీరింగ్‌ వింగ్‌ అధికా రులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking