ఫీల్డ్ అసిస్టెంట్లకు పేస్కేల్ అమలు చేయాలి జిల్లా అధ్యక్షులు గడ్డం రమేష్

 

జగిత్యాల, మార్చి 21: సెర్ఫ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పే స్కేల్ విధానాన్ని ఉపాధి హామిలోని ఫీల్డ్ అసిస్టెంట్లకు అమలుచేయాలని తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గడ్డం రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పతకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ గ్రామీణ పేద కూలీలకు పని కల్పిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయడంలో ముందున్నామన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వేసవి కాలంలో మండు టెండల్లో ఉపాధి హామీ పనులను చేపట్టడం జరుగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నిరోధించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లను ప్రభుత్వం గుర్తించాలని సెర్ఫ్ ఉద్యోగులకు అమలు చేస్తున్న పే స్కేల్ పద్ధతిని ఫీల్డ్ ఆసిస్టేట్స్ కు వర్తింపచేయాలని తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అద్యక్షులు గడ్డం రమేష్ కోరారు. ఆయన వెంట ఉపాధ్యక్షులు పొన్నం రాజు, గోగికార్ శ్రీనివాస్, కొలపాక రాజు, తొట్ల శంకర్, లక్ష్మణ్, రాజు తోపాటు వివిద మండలాల ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking