ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 21 : లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో కళాశాలలో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అధ్యాపకులు విద్యార్ధులు అందరూ సంప్రదాయ దుస్తులతో వేడుకలకు హాజరై కొత్తదనంతో కనువిందు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.జై. కిషన్ ఓజా అధ్యక్షత వహించి ఈ సంద్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్. జై కిషన్ ఓజా మాట్లాడుతూ… ఉగాది పండుగ తెలుగు వారి నూతన సంవత్సరం అన్నారు,తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలు ఆదర్శ ప్రాయమని పేర్కొన్నారు,ఈ శోభక్రుత్ నామ సంవత్సరం లో అందరికీ కొత్త విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. యువతరం తెలుగు వారి సాంప్రదాయ ఆచారాలు కాపాడుకోవాలని అన్నారు. అనతరం డా.శ్రీధర హరీష్,పంచాంగ శ్రవణo చేసి ఈ సంవత్సరం రాశి ఫలాలు తెలిపారన్నారు. విద్యార్ధుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమoలో వైస్ ప్రిన్సిపల్ డా. టి.గంగయ్య తెలుగు విభాగం అధ్యక్షులు డా.జి.శ్రీలత,ఈ కార్యక్రమం కో ఆర్డినేటర్ డా,తన్నీరు సురేశ్,అధ్యాపకులు డా, హరీష్,డా,కుమార స్వామి,డా. రాజ్ కుమార్,సవిత,మంజుల,శ్రీనివాస్, సంధ్యారాణి,కవిత చంద్ర శేఖర్, మల్లయ్య,రామచంద్రo,రాజ్ కుమార్,సత్యనారాయణ,మహేష్, సతీష్,విజయ్,రాయలింగు సౌజన్య,అపూర్వ బోధన బోధనేతర సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.