పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికే అయుష్మాన్ భారత్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 21 : పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికే అయుష్మాన్ భారత్ అని బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి అన్నారు. మంగళవారం ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ…ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేద ప్రజల వైద్యం కోసం ప్రవేశ పెట్టిన అయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు ఆరోగ్య భీమా పథకం లబ్ధిదారులకు గత వారం బిజెపి నాయకుడు సహకారంతో దండేపల్లి మండలం వెల్గనూర్,కాసిపేట గ్రామాల్లో ఉచిత రిజిస్ట్రేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి రెండు గ్రామాల్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 1500 మందికి ఈ రోజు రిజిస్ట్రేషన్ పత్రాలు రఘునాథ్ అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య,ముత్తే అనిలకుమార్,ముత్తే వెంకటేష్, అంబటిపల్లి ప్రసాద్,పంచెర్పల సత్యం,చుంచు రాజన్న,నల్లెల్లి శ్రీధర్,గౌరిశెట్టి సంతోష్,కండ్రపు మల్లేష్,తళ్లపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking