ఆధ్యాత్మిక చింతన తోనే అనుకున్న లక్ష్యాలు కోరికలు నెరవేరుతాయి.
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వోడితల ప్రణవ్.
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మార్చి 26
జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న 25వ వార్షికోత్సవ ద్వితీయ పుష్కర కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా పడిపూజ మహోత్సవంలో వోడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వోడితల ప్రణవ్ అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమంలో పాల్గొని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం ముందు నుండి చాలాసార్లు ప్రయాణించడం జరిగిందని,అయ్యప్ప స్వామి పుట్టినరోజు నాడు ఆ పడిపూజ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలుతెలిపారు. ఆధ్యాత్మిక చింతన తోనే అనుకున్న లక్ష్యాలు కోరికలు నెరవేరుతాయని, మనిషి జీవితంలో తప్పకుండా భగవంతుని నామస్మరణ చేయడం జరుగుతుందన్నారు. అయ్యప్ప దీక్ష కఠినమైన నిర్ణయాలతో కూడుకొని ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను జరిగయని , మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించిన అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయ అభివృద్ధికి దీప దూపా నైవేద్యాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, తాను ఏ స్థాయిలో ఉన్న జమ్మికుంట అయ్యప్పను మరవపోనని అన్నారు.
