మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 26 : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ మొదటి దశను పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 002-చెన్నూర్ 003 -బెల్లంపల్లి (ఎస్ సి)004- మంచిర్యాల శాసనసభ నియోజకవర్గంలోని జరుగుతున్న ఎన్నికల కొరకు పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో 1 వేయి 131 ప్రిసైడింగ్ అధికారులు,1 వేయి 111 సహాయక ప్రిసైడింగ్ అధికారులు,2 వేల131 ప్రిసైడింగ్ అధికారులు మొత్తం నాలుగు వేల 429 మంది సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని, సిబ్బందికి, ఎస్ ఎం ఎస్ తో పాటు సంబంధించిన ఉత్తర్వులను అందించడం జరిగిందని, ఉద్యోగులకు తమకు దంచిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.ప్రిసైడింగ్,ఇతర ప్రిసైడింగ్ అధికారులు శిక్షణ అందించడం జరిగిందని తెలిపారు. ఉద్యోగులకు కేటాయించిన నిధుల్లో సవరణల కొరకు జిల్లా ఎన్నికల అధికారి దరఖాస్తు రూమ్లో అందజేయడానికి తెలిపారు.ఈ ఈ కార్యక్రమంలో ఎన్నికల తహశిల్దార్ శ్రీనివాస్,ఈ- డిస్టిక్ మేనేజర్ సునీల్,ఎన్నికల విభాగ అధికారులు సమితి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking