జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మార్చి 26
ఎన్నికల మోడల్ కోడ్ కండక్టు అమలులో ఉంది. కావున జమ్మికుంట మున్సిపల్ మండలంలోని గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళిని పాటించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి తెలిపారు.
గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం రవాణా, డీజే సౌండ్ సిస్టం పెట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించిన, నిబంధనలకు మించి డబ్బులు తరలింపులు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని, ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు సోషల్ మీడియాలో పెట్టకూడదు. అలాంటి సంఘటనలకు పాల్పడితే గ్రూప్ అడ్మిన్, పోస్ట్ పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తిస్తున్నట్లు, ఎన్నికలను సజావుగా నిర్వహించడమే పోలీసుల కర్తవ్యము అని
అన్నారు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఎంతటి వారి పైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని. గతంలో రౌడీ షీటర్, హిస్టరీ షీట్, బైండోవర్ కేసులు ఉన్న వ్యక్తులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. లేనిపక్షంలో తాసిల్దార్ ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది అని తద్వారా లక్ష రూపాయల జరిమానా లేదా మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని హెచ్చరించారు.ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలి కోరారు.
మున్సిపల్, మండల పరిధి గ్రామాల్లోని ప్రజలు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు మీ దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.