ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 7
ఆదిలాబాద్, కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గము నుండి స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు పెద్దపెల్లి సత్యనారాయణ శుక్రవారం తన నామినేషన్ రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి కి అందజేశారు. అంతకుముందు నామినేషన్ వేయడానికి వెళ్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి బయలుదేరారు. ఆయనకు మద్దతుగా అంబేద్కర్ సంఘం నాయకులు మోయ రాంబాబు, కనకం రవీందర్, ముల్కల రాజేంద్రప్రసాద్, తుంగపిండి ఉపేందర్, బీసీ సంఘం నాయకులు సాదుల విద్యాసాగర్, చేగొండ సత్యనారాయణ, రమేష్ ప్రజాసంఘాల నాయకులు మధు, సత్యం, బాబు, రవి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
