పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి

 

గజ్జెల శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 26

మ్మికుంట ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. పెండింగ్ ఉన్న బకాయిలను విడుదల చేయాలని జమ్మికుంట తహసిల్దార్ గట్ల రమేష్ బాబు కు వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ లు పెండింగ్ లో ఉన్నాయి అని తెలియజేశారు. వాటిపైన ఇంతవరకు కూడా నూతన ప్రభుత్వం చర్చ పెట్టిన దాఖలాలే లేవు గత కొన్ని రోజుల ముందు డిగ్రీ కళాశాల యజమాన్యాలు కళాశాలలకు బంద్ చేసి ధర్నా నిర్వహిస్తే కొంత విడుదల చేస్తానని హామీ ఇచ్చారు దానిని ఇంతవరకు అమలు చేయకపోగా కనీసం ఆ అంశంపై చర్చ కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. విద్యార్థులు కళాశాల యజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్న కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు కావున తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రిబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రానున్న రోజుల్లో మంత్రుల ఎమ్మెల్యేల కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కలకోట అఖిల్ సందేశ్ సిద్దిక్, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking