వాస్తవ కథనాలతో ప్రజలకు చేరువ కావాలి

ప్రజాబలం క్యాలెండర్ ఆవిష్కరణ

మందమర్రి ఎస్సై శివనీతి రాజశేఖర్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 27 :

వాస్తవ కథనాలతో పత్రికలు ప్రజలకు చేరువ కావాలని మందమర్రి ఎస్సై శివనీతి రాజశేఖర్ అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రజాబలం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాబలం పత్రిక వాస్తవ కధనాలను అందిస్తూ అనతి కాలంలోనే ప్రజలకు చేరువ కావడం సంతోషమని ఆయన అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి దిక్సూచి కావాలన్నారు. పాఠకులు మెచ్చే విధంగా ప్రజాబలం పత్రిక కొనసాగుతుందని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రజాబలం యాజమాన్యాన్ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు సకినాల శంకర్, గౌరవ అధ్యక్షులు బొలిశెట్టి రాజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ బేర వేణుగోపాలరావు, కార్యవర్గ సభ్యులు రాజిరెడ్డి, పాత్రికేయుడు రాయమల్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking