ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలి

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజ

ఖమ్మం ప్రతినిది జనవరి27 (ప్రజాబలం) ఖమ్మం
ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యత తో పరిష్కరించి, పెండింగ్ లేకుండా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన జి. మౌనిక తనకు సొంత ఇండ్లు లేకపోయినా ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదని, తనకు ఇల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, చింతకాని తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు కొణిజెర్ల మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన కుర్రా వీరభద్రం, సర్వేనెంబర్ 298/అ లో ఎకరం భూమి తన భార్య పేరు మీద రికార్డులలో నమోదయిందని, డిసెంబర్ 12, 2016న తన భార్య చనిపోయిందని, ఆ భూమి తన పేరుపై నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ భూమిని ఇతరుల పేరిట మార్పిడి చేసి పట్టా పుస్తకం జారీ చేశారని, దీనిపై విచారణ జరిపి తప్పుడు పట్టాను రద్దుచేసి తన పేరు మీద పట్టా జారీ చేయగలరని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కొణిజెర్ల కు రాస్తూ వెంటనే విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు తల్లాడ మండలం రామానుజవరం గ్రామానికి చెందిన శీలం నరేందర్ రెడ్డి తమ గ్రామంలో గృహ నివాసాల మధ్య మొబైల్ టవర్ ఉందని, దీనిని తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, మండల పంచాయతీ అధికారికి రాస్తూ ఈ అంశంపై గ్రామసభ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు పువ్వాడ నగర్ గ్రామానికి చెందిన షేక్ సాదిక్ పాషా తాను గతంలో ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించానని, తనకు గత డిసెంబర్ నెలలో మంత్రి పర్యటన సందర్భంగా గ్రామంలో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని అధికారులకు ఆదేశించారని, తనకు ఇప్పటివరకు ఇండ్లు కేటాయించలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, రెవెన్యూ డివిజన్ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో ఎన్. అరుణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking