నిర్మల్ లో గంజాయి అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ లో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు నిర్మల్ డి.ఎస్.పి,గంగారెడ్డి గారు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం తేది: 05-09-2024 రోజున ఉదయం ముందస్తు సమాచారం ప్రకారం, పట్టణ ఎస్ ఐ రమేష్ మరియు వారి సిబ్బంది అందరు కలసి నిర్మల్ లోని స్థానిక మంచిర్యాల చౌరస్తా లో గల చాచా టీ సెంటర్ వద్ద ఉండగా, ఏ1. చౌస్ అబ్రార్ @ అబ్రార్ బిన్ సయీద్ మరియు ఏ2. షేక్ రఫాయి అను వ్యక్తులు ఒక ప్లాస్టిక్ కవర్ లో విడి గంజాయి తీసుకొని తమ కస్టమర్ లకు అమ్ముదామని వెళ్ళుతుండగా పట్టుకొని విచారించగా వారు మరియు వారి మిత్రుడు ఏ 3. మహమ్మద్ అయాన్ అను వారు కలిసి గంజాయి అమ్ముతున్నారని, వారు ఏ4.బారి ఆర్/ఓ భైంసా అనే వ్యక్తి వద్ద కొని తన కస్టమర్ లకు అమ్ముతున్నారని తెలిపినారు, ఇద్దరి వద్ద నుండి సుమారు 1.200 కేజి గంజాయి స్వాదీనపరచుకొని ఇద్దరినీ ఈరోజు రిమాండ్ కు తరలించడమైనదని నిర్మల్ పోలీసు వారు తెల్పినారు. నిర్మల్ జిల్లాలో ఎవరైనా గాంజా అమ్మితే వెంటనే పోలీస్ లకు తెలుపగలరని వారి పేర్లను కూడా మేము రహస్యంగానే ఉంచుతామని నిర్మల్ డి.ఎస్.పి తెలిపినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking