సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలి

 

ప్రభుత్వ నిషేధిత గంజాయి రవాణాను అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల తీరు ప్రశంసనీయం

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి

నెలవారీ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి సెప్టెంబర్ 21 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల సమయంలో గణేష్ నవరాత్రులు,నిమజ్జన కార్యక్రమాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అంకితభావంతో అహర్నిశలు ప్రజలకు సేవలాందించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోనే విధంగా నమ్మకాన్ని కలిగించారని ప్రశంసించారు.కొత్త కొత్త టెక్నాలజీలతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల ఖాతాల నుండి నగదు మాయం చేస్తున్నారు సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలకు అనునిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వారిని అప్రమత్తం చేయాలని తెలిపారు.ప్రతీ కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా బాధ్యతగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.దొంగతనం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు గంజాయి లాంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహారించాలని తెలిపారు.గుట్కా,మట్కా జూదం బెట్టింగు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని తెలిపారు రౌడీషీటర్లు మరియు పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసుకుని వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు.బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు.జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ నివారణాచర్యలు చేపట్టాలని సూచించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వారి కదిలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అనంతరం గత నెలలో వర్టికల్స్ వారీగా అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి ప్రశం సాపత్రాలను అందజేశారు ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వర్ ఐపిఎస్,ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు శ్రీనివాస్,ఐటి సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో జయరాజు మరియు సీఐలు,ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking