వైద్యం వికటించి గర్భిణీ స్త్రీ మృతి..! ఏడు గంటల పాటు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన. వైద్యురాలి అరెస్ట్ కేసు నమోదు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లైన్ లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం మధ్యాహ్నం నిర్మల్ పట్టణంలోని శేఖ్ సహాబ్ పేటకు చెందిన మహమ్మద్ అప్రోచ్ ఖాన్ తన భార్య ఫరహ్ బేగం కుడెలివరీ నిమిత్తం చేర్పించారు. డెలివరీ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఆమె ఆరోగ్యం ఆందోళనకారంగా మారింది.దీంతో రాత్రి వరకు కూడా స్థానికంగానే చికిత్సలు అందించిన వైద్యురాలు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో హైదరాబాద్ కు రిఫర్ చేశారు.శుక్రవారం రాత్రి హైదరాబాద్ చికిత్స పొందుతూ గర్భిణీ స్త్రీ మృతి చెందింది. శనివారం ఉదయం సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు నిర్మల్ పట్టణంలోని డాక్టర్స్ లైన్ లో గల సదరు ఆసుపత్రి ముందర ప్రధాన రహదారిపై బైఠాయించి సుమారు 7 గంటల పాటు తమ నిరసనను తెలిపారు. వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీ స్త్రీ మృతి చెందినట్లు ఆరోపిస్తూ నినాదాలు చేశారు.డాక్టర్ ను అరెస్టు చేయాలి ఆసుపత్రిని ముగించాలంటూ ఆందోళన చేపట్టారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఏకతాటిగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన కారులు ఆందోళనలు చేయడంతో పట్టణంలోని అంతర్గత ప్రధాన రహదారులలో వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.జోక్యం చేసుకున్న పట్టణ పోలీసులు ఆందోళన కారులను శాంతింప చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి నిర్మల్ ఐఎంఏ బాధ్యులు జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆదేశాల మేరకు సదరు ఆసుపత్రికి చేరుకొని పోలీసుల సమక్షంలో సదరు వైద్యురాలితో చర్చించారు. అనంతరం ఆందోళనకారులకు వైద్యురాలితో జరిగిన చర్చలను తెలిపి మృతురాలి కుటుంబానికి అన్ని విధాల తోడునీడగా ఉంటామని న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని భైంసా అదనపు ఎస్పి అవినాష్ కుమార్, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ లు భరోసా కల్పించడంతో వారు తమ ఆందోళనను విరమింపజేశారు. మృతురాలి భర్త మహమ్మద్ అఫ్రోజ్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు వైద్యురాలని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నారు