ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 23 :
పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కేటాయించిన విధులను అధికారుల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బాధ్యతలు స్వీకరించిన కె.శ్రీకళ శుక్రవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…శాఖా పరంగా కేటాయించిన విధులను అధికారుల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన కె.శ్రీకళ నిర్మల్ జిల్లా నుండి బదిలీపై ఇక్కడకు వచ్చారు.