మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్.
మెదక్ ప్రజాబలం న్యూస్ :-
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో నియమ నిబంధనలు అతిక్రమించి ఆలయంలో రాజకీయ కార్యక్రమాలు చేపట్టిన సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ డిమాండ్ చేశారు ఎండోమెంట్ ఆక్ట్7 ప్రకారం ఆలయంలో రాజకీయ కార్యక్రమాలు చేపట్టకూడదన్న విషయం హరీష్ రావు కు తెలియకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు ఆలయంలో రాజకీయ కార్యక్రమ పూజలు చేసి పవిత్ర యాదాద్రి ఆలయాన్ని హరీష్ రావు అపవిత్రం చేశారని అందుకు తెలంగాణ ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని మాట తప్పిన హరీష్ రావు ముందు రాజీనామా చేసి గుళ్ళు గోపురాలు తిరగాలని విమర్శించారు.