జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 23 : విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారాన్ని అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్లలో గల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్లు, రికార్డులు,తరగతి గదులు,వంటశాల,ఆహార సామాగ్రిని పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి,మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు,విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా పాటించవలసిన జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించాలని,ఆహారం తీసుకోవడానికి ముందు కచ్చితంగా చేతులు శుభ్రపరచుకునేలా విద్యార్థులకు వివరించాలని తెలిపారు.విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.మోహన్,ఉపాధ్యాయులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొంటున్నారు.