మెదక్,23/08/24 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా కేంద్రం లో తపస్ కార్యాలయం లో తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీల కోసం ప్రభుత్వం షెడ్యూల్ విడుదల విడుదల చేసింది అని,ఈ బదిలీలలో గరిష్టంగా 8 సంవత్సరాలు ఒకే చోట పని చేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని,అదే విదంగా జీరో సర్వీస్ ఉన్న వారికి కూడా బదిలీల లో అవకాశం ఇవ్వాలి అని, సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మినిమం పే స్కేల్ వర్తింపచేయాలని, కేజీబీవీ లో విద్యార్థులను చూసుకోవడానికి కేర్ టెకర్ లను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తపస్ మెదక్ జిల్లా నాయకులు మాధవరెడ్డి, శ్రీధర్ రెడ్డి,సురేందర్ తదితరులు పాల్గొన్నారు