ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ ఆగస్టు 23:నాచారంలోని డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ నవనీతరావు, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ కుమార్ లు పాల్గొన్నారు. పాఠశాల అంత పూల పరిమళంతో, ఆధ్యాత్మికతలతో నిండిపోయింది. పిల్లల రంగురంగుల వస్త్రాలతో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించింది. ప్రీ-ప్రైమరీ విద్యార్థులు రాధ కృష్ణ
వస్త్రధారణలతో అలరించారు. ఎంతో ఉల్లాసంగా శ్రీకృష్ణ జననం, శ్రీకృష్ణ లీలలు నాటకాన్ని చిన్నారులు రక్తి కట్టించారు. అనంతరం
విద్యార్థులు ఉట్టి’ కొట్టే కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు పండుగ ప్రత్యేకతను తెలుపుతూ నృత్య గానాలతో ఆనందంతో జరుపుకున్నారు.ప్రతి విద్యార్థికి శ్రీకృష్ణుని ఆశీస్సుల ఉండాలనీ, ప్రతి పనిలో తోడుగా నిలిచి విజయం సాధించాలని ప్రిన్సిపాల్ సుమా మీనన్ అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్ హెడ్ ఆపరేషన్స్ కిషోర్ కుమార్ రెడ్డి, వైస్ ప్రిస్సిపాల్స్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.